రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడప: పులివెందుల పట్టణం అహోబిలాపురానికి చెందిన హరిచంద్ర అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం హరిచంద్ర తన ద్విచక్ర వాహనంలో ముత్తుకూరు గ్రామానికి వెళుతుండగా, ఎర్రిపల్లె గ్రామ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హరిచంద్ర మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.