విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

ప్రకాశం: ఒంగోలు వన్ టౌన్ పరిధిలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ మద్యం, గంజాయి, మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. నిషేధిత ఉత్పత్తులను వాహనాల్లో తరలించడం చట్టరీత్యా నేరమని, వాహనదారులను పోలీసులు హెచ్చరించారు.