లింగాపూర్‌లో తాగునీటి తంటాలు

లింగాపూర్‌లో తాగునీటి తంటాలు

సిద్దిపేట: ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్‌లో వారం రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు. నీటి కోసం గ్రామస్థులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో గ్రామానికి నీటిని సరఫరా చేసే రెండు బోరుబావుల్లో ఒక బోరుబావి ఎండిపోయింది. దీనికి తోడు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు సరిపోకపోవడంతో గ్రామంలో నీటి సమస్య అధికమైంది. బావిల వద్ద నీటిని తోడుకుంటున్నారు. నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.