VIDEO: ఆలయం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో ఉన్న హనుమాన్ మందిరాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ గోడలు, తలుపులు పగలగొట్టడమే కాకుండా లోపల బీర్ సీసాలు విసిరి అపవిత్రం చేశారు. ఈ ఘటనపై స్థానిక భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.