అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరులోని తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి RWS అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి సమస్య రాకుండా చూడాలని సూచించారు. గ్రామాల్లో నీటి సరఫరా సమస్య ఉంటే తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు.