సూర్యాపేట-ఖమ్మం రోడ్డులో కారుకు ప్రమాదం

సూర్యాపేట-ఖమ్మం రోడ్డులో కారుకు ప్రమాదం

SRPT: సూర్యాపేట-ఖమ్మం రోడ్డుపై పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు చివేముల మండలంలోని వట్టికాంపాడు ఎక్స్ రోడ్ సమీపంలోకి రాగానే అతివేగంతో అదుపు తప్పి పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.