నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో YCP ర్యాలీ

నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో YCP ర్యాలీ

AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో సంతకాల సేకరణ పూర్తి కాగా.. ఇవాళ జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ర్యాలీ అనంతరం సంతకాల పత్రాలు తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఈ నెల 18న జగన్ ఈ కోటి సంతకాల పత్రాలను గవర్నర్ నజీర్‌కు అందజేయనున్నారు.