రేపు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

రేపు విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

NRML: పర్యావరణహితమే సమాజ హితమని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అన్నారు. వినాయక చవితి నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లాలోని భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ జిల్లా, నగర పధాధికారులు పాల్గొన్నారు.