'జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి'

CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 8వ తేదీ (శనివారం) జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో కక్షదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ. బీమారావ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.