యుద్ధం.. నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై US అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ చమురు నిల్వలపై క్షిపణి దాడులు చేయటాన్ని తప్పుబట్టినట్లు సమాచారం. చమురు జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీసినట్లు ఆంగ్ల మీడియా తెలిపింది. అయితే తమ జనావాసాలపై ఇరాన్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే చమురు డిపోలను లక్ష్యంగా చేసుకున్నట్లు నెతన్యాహు వివరణ ఇచ్చినట్లు చెప్పింది.