VIDEO: జమ్మలమడుగు SI హెచ్చరికల జారీ
KDP: 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జమ్మలమడుగు అర్బన్ SI రామకృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులు, మిత్రులు గుంపులుగా ఉండరాదన్నారు. ఏదైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.