గుంతలతో రోడ్డు మార్గం
SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రం నుండి బుడగట్లపాలెం, బడివానిపేట, కుప్పిలి, కొయ్యాం తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం గుంతలతో అధ్వానంగా తయారైందని వాహనదారులు అంటున్నారు. నిత్యం సుమారు 20 గ్రాములకు చెందిన ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.