జనసేన నేతపై పోలీసులకు ఫిర్యాదు
NLR: తెనాలి నియోజకవర్గంలో జనసేన కార్యకర్త చల్లా నాగరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను జీడీ నెల్లూరు దళిత నేత నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు వినడానికే జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. తక్షణమే చల్లా నాగరాజుపై చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో దళిత యువ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.