మహిళా సాధికారత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
BDK: 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా బుధవారం బూర్గంపాడు మండలం ఎంపీ బంజరలో మహిళా సాధికారత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహ విముక్త భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సంతోష్ రూప పాల్గొని లింగ వివక్షత, సమానత్వం, బాల్య వివాహాల అనర్థాలు, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు.