తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడికి గాయాలు
BHPL: రేగొండ మండల కేంద్రంలో బండి ఆగయ్య గౌడ్ అనే గీతకార్మికుడు తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లి కాలు జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో కార్మికుడుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన గీతకార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని గీతకార్మిక సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నాట్లు తెలిపారు.