నేడు జరగాల్సిన భూముల బహిరంగ వేలం వాయిదా
HNK: పట్టణంలోని బాలసముద్రంలో గల 12,957 చదరపు గజాల వాణిజ్యపరమైన భూమిని అమ్మదలచి బహిరంగ వేలం వేయడానికి గతంలో నవంబర్ 14వ తేదీని నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం జరగాల్సిన బహిరంగ వేలాన్ని వాయిదా వేస్తున్నామని కుడా వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్ పాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి వేలం చేపట్టే తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.