గ్రామ అభివృద్ధికి బాండ్ రాసిన అభ్యర్థి
NRPT: నర్వ మండల కేంద్రంలోని బీజేపీ సర్పంచ్ అభ్యర్థి వావిళ్ళ నరేందర్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రూ.100 బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. "గ్రామ లక్ష్మి" అనే పథకంతో ఆడబిడ్డకు రూ.2516 ఆర్థిక సహాయం, మినీ ప్లే గ్రౌండ్ వంటివి చేస్తానన్నారు. గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు చెప్పారు.