నూజివీడు డివిజన్‌లో భారీ వర్షపాతం

ELR: నూజివీడు రెవిన్యూ డివిజన్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షపాతం నమోదైంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి కురిసిన వర్షానికి డివిజన్ వ్యాప్తంగా 18.8 మీ వర్షపాతం నమోదైనట్లు సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు. చాట్రాయిలో 42.2మిమీ, నూజివీడులో 28.8మిమీ, ఆగిరిపల్లిలో 26.6 మిమీ, చింతలపూడిలో 8.4మిమీ, ముసునూరులో 6.8మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.