పెళ్లింట విషాదం

MDK: కుమారుడి పెళ్లి అయిన గంట వ్యవధిలో తల్లి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో జరిగింది. గ్రామంలో మల్కాని నరసమ్మ(48) కొడుకు రవీందర్ పెళ్లి బుధవారం జరిగింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పెళ్లైన గంట వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుభకార్యం జరిగిన ఇంట్లోనే చావు కబురు వినడం హృదయాలను కలచివేసింది.