అండర్ 19 క్రికెట్ జట్టుకు శ్రీవల్లి ఎంపిక
SRCL: ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట శ్రీవల్లి హైదరాబాద్ అండర్ 19 క్రికెట్ జట్టుకు ఎంపిక అయ్యింది. కట్ట లక్ష్మారెడ్డి, ఉమారాణిల చిన్న కూతురు అయిన శ్రీవల్లి గతంలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే హైదరాబాద్ ఉమెన్స్ జట్టుకు ఎంపికై ప్రతిభ కనబరిచింది. ఈనెల 26 నుంచి ముంబైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే పోటీలలో శ్రీవల్లి పాల్గొననుంది.