నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి: సీపీఐ
GNTR: చదువులు పూర్తి చేసిన యువత ఉద్యోగాలు లేక ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి అన్నారు. గుంటూరు శారద కాలనీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌పై ఆందోళన చెందుతూ, సెక్యూరిటీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు తక్షణమే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.