మల్లవల్లి మాజీ సర్పంచ్‌కు నివాళి

మల్లవల్లి మాజీ సర్పంచ్‌కు నివాళి

కృష్ణా: బాపులపాడు మండలం మల్లవల్లి మాజీ సర్పంచ్ వణుకూరి జోజి మృతదేహానికి సోమవారం పలువురు నివాళులర్పించారు. జోజి సేవలు మరిచిపోలేనివని, గ్రామ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని సాగునీటి వినియోగదారుల సమైక్య అధ్యక్షుడు ఆళ్ళ గోపాలకృష్ణ అన్నారు. ఆయన మృతి గ్రామానికి తీరని లోటునని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.