పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. లేబర్ కోడ్ రచ్చ
పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమైన వేళ బయట విపక్షాల ఆందోళనతో హీట్ పెరిగింది. లేబర్ కోడ్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ నిరసనలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసేదాకా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.