ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్

W.G: పాలకొల్లులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నరసాపురం DSP శ్రీవేద తెలిపారు. పట్టణానికి చెందిన వెంకట్రావు, వెంకట్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు,10 సెల్‌ఫోన్లు, రూ.33వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. HYD, విశాఖ కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.