VIDEO: భారత్ గ్యాస్ గోదాం వద్ద హనుమాన్ స్వాముల ఆందోళన
MHBD: తొర్రూర్ పట్టణంలో భారత్ గ్యాస్ గోదాం వద్ద శుక్రవారం హనుమాన్ స్వాములు ఆందోళన చేపట్టారు. గ్యాస్ బుక్ చేసి 20 రోజులు గడిచినా సరఫరా చేయలేదని వారు ఆరోపించారు. అయితే గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్నారని స్వాములు మండిపడ్డారు. భిక్ష కోసం అయినా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కోరినా, గోదాం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.