VIDEO: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: రాయచోటి మండలం ఇనాయత్ చెరువు సమీపంలో బుధవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో కోటకొండ రవి తీవ్రంగా గాయపడ్డారు. గునుకుంట్ల నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. గాయపడిన రవిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.