VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
KDP: సిద్ధవటం మండలం కడప -చెన్నై జాతీయ రహదారిలోని కొత్త మాధవరం PHC వద్ద ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుకుల లోడుతో వెళుతున్న ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.