భారత్‌కు మరింత ముడిచమురు, LNG: రష్యా
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, రష్యా దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి అంగీకరించాయి. భారతదేశానికి ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచడానికి రష్యా ముందుకొచ్చింది. రష్యా ఉప ప్రధాని డెనిస్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, విదేశాంగ మంత్రి జైశంకర్ మధ్య జరిగిన భేటీలో ఇంధన సహకారంపై చర్చించారు. ప్రధాని మోదీని కూడా డెనిస్ కలిశారు.