'సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి'
NRPT: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్, బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని తహసీల్దార్ సింధూజాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందులో ఎమ్మార్పీఎస్, బీఎస్పీ నాయకులు తిమ్మయ్య, నర్సింలు, రాజు, తదితరులు ఉన్నారు.