ఒంటిమిట్టలో భక్తుల రద్దీ.. రామనామంతో మారుమ్రోగిన ఆలయం

ఒంటిమిట్టలో భక్తుల రద్దీ.. రామనామంతో మారుమ్రోగిన ఆలయం

KDP: ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే టీటీడీ ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. 'జై శ్రీరామ్' నినాదాలతో ఆలయం మొత్తం మారుమ్రోగింది. రామయ్య దర్శనం కోసం వృద్ధులు, యువత పెద్దఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.