నేడు కలెక్టరేట్లో యథాతథంగా 'పీజీఆర్ఎస్': కలెక్టర్
E.G: రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను 'Meekosam.ap.gov.in' చేసుకోవచ్చని, వివరాల కోసం 1100 నంబరును సంప్రదించాలని సూచించారు. అధికారులు విధిగా హాజరై అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు.