నూతన సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: పెనుబల్లి మండలం లంకపల్లిలో శుక్రవారం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా నూతన సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే మట్ట రాగమయి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరమైన విద్యుత్ అందిస్తుందని చెప్పారు. అనంతరం సబ్ స్టేషన్ ఆవరణంలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.