VIDEO: వచ్చే నెల 3 నుంచి పాళ్లమ్మ అమ్మవారి జాతర
కోనసీమ: మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామ దేవత పాళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఏప్రిల్ 3 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరుగుతాయని ఆలయ చైర్మన్ సాధనాల సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో జాతర మహోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.