ప్రేమజంటపై దాడి.. యువతిని తీసుకెళ్లిన బంధువులు
AP: ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి బంధువులు దాడి చేసి ఆమెను తీసుకెళ్లిన ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో IS రాఘవాపురానికి చెందిన సంజిత్, వెంకటాపురానికి(కామవరపుకోట) చెందిన పద్మ ఈ నెల 20న వివాహం చేసుకున్నారు. ఆపై రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పద్మ తల్లిదండ్రులు సంజిత్ ఇంటిపై దాడికి దిగి ఆమెను తీసుకెళ్లిపోయారు.