VIDEO: వారం రోజుల్లో ఉద్యోగం ఇప్పిస్తాను: ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం నియోజకవర్గానికి చెందిన ఓ దివ్యాంగుడు బుధవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కలిశారు. తాను ఆర్థికంగా బాధపడుతున్నానని, వ్యాపారం చేసినా లాభం లేకుండా పోయిందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వారం రోజుల్లో ఉద్యోగం కల్పించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దివ్యాంగుడు హర్షం వ్యక్తం చేశారు.