ఈనెల 10న ఆందోళనకు పిలుపు
W.G: భీమవరం సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏపీ కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎం యూనియన్ జిల్లా సమావేశం జరిగింది. యూనియన్ నాయకురాలు పి.లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో సెకండ్ ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. నవంబర్ 10న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. జిల్లాలోని సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు