పెండింగ్ వినతులు ఉంటే సహించను: కలెక్టర్
VZM: రెవెన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ వినతులు ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాలు, OBC సర్టిఫికెట్లు, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు సేవలు గడువు దాటకుండా పూర్తవ్వాలన్నారు.