ఈనెల 30న అఖిలపక్ష సమావేశం
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు 19 రోజులపాటు కొనసాగనున్నాయి. సెలవు రోజులు మినహా 15 రోజులపాటు పార్లమెంట్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం నిర్వహించనుంది. కాగా, గతేడాది శీతాకాల సమావేశాలు నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు జరిగాయి.