పింఛన్ నగదును అందజేసిన ఎంపీడీవో
కృష్ణా: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గుడ్లవల్లేరు మండలం ఉలవలపూడి గ్రామంలో ఎంపీడీవో ఎండీ ఇమ్రాన్ బుధవారం లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్ల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటవ తేదీన లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.