మృతదేహానికి నివాళులర్పించిన ఎంపీ కుమారుడు

మృతదేహానికి నివాళులర్పించిన ఎంపీ కుమారుడు

సత్యసాయి: పరిగి మండలం సుబ్బరాయునిపల్లి గ్రామానికి చెందిన రామాంజినప్ప శుక్రవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం ఎంపీ పార్థసారథి కుమారుడు సాయి కళ్యాణ్ వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అల్లుడు శశిభూషణ్ పటేల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.