మహిళపై దాడి.. ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్
SRPT: మోతే మండలం అన్నారం గూడెంలో పడిశాల సాలమ్మ అనే మహిళపై పాత గొడవల నేపథ్యంలో కరుణాకర్, సాయి అనే వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితురాలు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై అజయ్ కుమార్ వెంటనే స్పందించి, బాధితురాలి ఇంటికే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే 'డోర్ స్టెప్ ఎఫ్‌ఐఆర్' నమోదు చేసి కాపీని అందజేశారు.