తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం
MDK: లోక్‌సభలో తెలంగాణ-ఆంధ్ర విభజనను ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. అమరవీరుల త్యాగాలను అవమానించేలా మాట్లాడటం దుర్మార్గం అని విమర్శించారు.