మద్దూరు రైతుల ముందడుగు.. అమరావతికి 56 ఎకరాలు
PLD: అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన 29 మంది రైతులు స్వచ్ఛందంగా 56 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రైతుల నుంచి భూమి పత్రాలను స్వీకరించారు. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన రైతులను ఆయన అభినందించారు.