వైభవంగా సీతారాముల విగ్రహాల ప్రతిష్ట
KKD: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మించిన తూలగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సీతానగరం ఆశ్రమాధిపతి త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహా ప్రతిష్ట మహోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.