ఏపీలో స్లీపర్‌ బస్సుల రద్దుకు సన్నాహాలు

ఏపీలో స్లీపర్‌ బస్సుల రద్దుకు సన్నాహాలు

అన్నమయ్య: స్లీపర్‌ బస్సులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో స్లీపర్‌ బస్సులను రద్దు చేయాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 300 Kmలకు పైగా ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవర్ల పనితీరును పర్యవేక్షించేందుకు AI ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.