దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక దాడులు
CTR: ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను విక్రయిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. పారిశుద్ధ విభాగపు అధికారి ముని వెంకటప్ప ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి సోమవారం సాయంత్రం పుంగనూరు పట్టణంలో వివిధ దుకాణాలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లను గుర్తించి జరిమానాలు విధించారు.