ఆర్టీసీ జేఏసీ చర్చలు వాయిదా..!

ఆర్టీసీ జేఏసీ చర్చలు వాయిదా..!

TG: హైదరాబాద్ వేదికగా ఆర్టీసీ జేఏసీ నేతలతో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు ఈ చర్చలు ఉండవని లేబర్ కమిషనర్ జేఏసీ నాయకులకు సమాచారం అందించారు. ప్రభుత్వ నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు రేపు ఈయూ ఆఫీస్‌లో జేఏసీ అత్యవసరంగా సమావేశం కానుంది. చర్చల వాయిదాతో కార్మిక సంఘాల్లో ఉత్కంఠ నెలకొంది.