'మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యం'

'మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యం'

KNR: మహిళలు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. అక్టోబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో 70 ప్రాంతాల్లో నిఘా పెట్టి, 30 మంది పోకిరీలను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. కొందరి ఫిర్యాదుల మేరకు 13 మంది వ్యక్తులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.