'ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి'

KMM: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో ఎర్రయ్య కోరారు. సోమవారం నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెప్పారు. ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు.