VIDEO: చండ్రుగొండ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. టైర్ పేలడంతో నియంత్రణ కోల్పోయిన లారీ మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన డ్రైవర్ రామ్మూర్తిగా పోలీసులు గుర్తించారు.